హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): బడిబాట షెడ్యూల్ మారే అవకాశముంది. జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయించి, షెడ్యూల్ సైతం ప్రకటించింది. కాగా, విద్యాశాఖ బడిబాట ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించింది.ఎన్నికలకోడ్ అమల్లో ఉండటంతో బడిబాటలో సీఎం పాల్గొనడం వీలుపడదు. ఈనెల 6తో ముగియనున్న ఎన్నికలకోడ్ తర్వాతే బడిబాట ప్రారంభించే అవకాశాలున్నాయి. బడిబాట షెడ్యూల్ మార్పునకు సీఎం అనుమతి కోరినట్టు తెలిసింది.