బిల్లు రాలేదని పాఠశాలకు తాళం.. కరీంనగర్ జిల్లా వల్లంపట్లలో ఘటన
చేసిన పనులకు సంబంధించి బిల్లు రాకపోవడంతో ఓ మాజీ సర్పంచ్ భర్త పాఠశాలకు తాళంవేసి నిరసన తెలిపాడు.
- రూ.22 లక్షల బిల్లుల పెండింగ్‌పై మాజీ సర్పంచ్ భర్త ఆవేదన
ఇల్లంతకుంట రూరల్, ఏప్రిల్ 16 : చేసిన పనులకు సంబంధించి బిల్లు రాకపోవడంతో ఓ మాజీ సర్పంచ్ భర్త పాఠశాలకు తాళంవేసి నిరసన తెలిపాడు. మూడేండ్ల క్రితం మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ భర్త వెంకటనర్సింహారెడ్డి రూ.44 లక్షలతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో రెండు పాఠశాల భవనాలతోపాటు డైనింగ్‌హాల్ నిర్మించాడు. దీనికి సంబంధించి రూ. 22 లక్షల బిల్లులు రాగా, మరో రూ. 22 లక్షల బిల్లుల కోసం డీపీవో, ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లినా రాకపోవడంతో విసిగిపోయాడు.
ఈ క్రమంలో గురువారం పాఠశాల నూతనగదులతోపాటు డైనింగ్‌హాల్‌కు తాళంవేశాడు. ఎస్ఎంసీ తీర్మానం మేరకు నిర్మాణాలు చేశామని, ఇప్పుడు బిల్లుల కోసం ఇబ్బందులు పెడుతున్నారని, బిల్లు వచ్చేవరకు పాఠశాల తాళం తీసేదిలేదని వెంకటనర్సింహారెడ్డి స్పష్టంచేశాడు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు వరండాలోనే కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఎస్ఐ సిరిసిల్ల అశోక్ పాఠశాలను సందర్శించి గదులను పరిశీలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

