హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ద్వారా తెలుగు రాష్ర్టాల్లోని కార్మికుల పిల్లలకు ఈ ఏడాదికి స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్టు అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీడీ, సినీ కార్మికులు, లైమ్‌స్టోన్, డోలమైట్, మైకా, ఐరన్‌ఓర్, మాంసనీస్ ఓర్, క్రోమ్ ఓర్ కార్మికుల పిల్లల నుంచి దరఖాస్తులు కోరారు. ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 31లోపు, ఇంటర్ నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలని కో రారు. వివరాలకు https://scholarships. gov.in/ వెబ్‌సైట్‌ను, 01206619540 హెల్ప్‌లైన్ నంబర్, helpdesk@nsp.gov.inకు మె యిల్ ద్వారా సంప్రదించాలని సూచించారు.