హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్టు ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ దండా రాజిరెడ్డి తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న స్పె షలైజ్డ్ యూనివర్సిటీలతో కలిసి పని చేయనున్నట్టు పేర్కొన్నారు. శనివారం యూనివర్సిటీలో విద్యార్థులు, శా స్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఉద్యాన విద్యల్లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కేవలం 12.8 లక్షల ఎకరాల ఉ ద్యాన పంటల విస్తీర్ణంతో 25 శాతం జీఎస్టీపీ కంట్రిబ్యూట్ చేస్తున్నదని, ఇది పెరిగే అవకాశం ఉందని చెప్పారు.