హైదరాబాద్, ఏప్రిల్24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన అభ్యర్థుల్లో ఇద్దరు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైనట్టు ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ క్షితిజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గోకమల్ల ఆంజనేయులు 934కు, రాంటెంకి సుధాకర్ 949వ ర్యాంకు సాధించారని తెలిపారు. గ్రూప్-1 పలితాల్లోనూ స్టడీ సర్కిల్ నుంచి 40 మంది ఎంపికయ్యే చాన్స్ ఉన్నదని పేర్కొన్నారు.