కరీంనగర్ రూర ల్, నవంబర్ 22: విద్యార్థులను చితక బాదిన ఉపాధ్యా యుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన ఘట న కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ విట్స్ కళాశాల కాంప్లెక్స్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాల-1లో శుక్రవారం రాత్రి సరిగా చదవట్లేదని ముగ్గురు విద్యార్థులను ఇంగ్లిష్ టీచర్ శ్రీనివాస్ విచక్షణారహితంగా కొట్టాడు. వారిలో పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని తండాకు చెందిన బదావత్ సంజయ్ ఎస్టీ విద్యార్థి ఉన్నాడు. అతని చేయి విరగడంతో విద్యార్థి తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్‌పై కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు.