హైదరాబాద్, సెప్టెంబర్14 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 317 జీవో అమలులో భాగంగా అనేక లోపాలు చో టుచేసుకున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలను సొసైటీ ఉన్నతాధికారులు పూర్తిగా తుంగలో తొక్కారు. ఆ లోపాలను సవరించాలని ఉద్యోగులు చేసిన వినతులు సైతం బుట్టదాఖలయ్యాయి. ఫలితంగా ఎందరో ఉద్యోగులు అన్యాయానికి గురై అవస్థలు పడుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం, ఇటు సొసైటీ ఉన్నతాధికారులు స్పందించడమే లేదని గురుకుల సొసైటీ ఉద్యోగులు మండిపడుతున్నారు. తక్షణమే స్పందించకుంటే త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం 317 జీవోలో భాగంగా మెడికల్, స్పౌజ్, మెడికల్ క్యాటగిరీల్లో బదిలీలకు వేర్వేరుగా గతంలో అనుమతులను జారీచేసింది. 317 జీవో అమ లు చేయాలంటే ఒక కచ్చితమైన కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీకి అధికారిగా ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి. ఎస్సీ గురుకుల సొసైటీ వాటిని పాటించనేలేదు. బదిలీల్లో భాగంగా సొసైటీ పరిధిలో 130 మంది ఉద్యోగులు 317 జీవోకు దరఖాస్తు చేసుకున్నారు. అనేక మంది దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించలేదని తెలుస్తున్నది. ప్రభుత్వ మార్గదర్శకాలను సొసైటీ పాటించలేదని, లోపాలున్నాయని, వాటిని పునఃసమీక్షించాలని గతంలో ఆర్థికశాఖ కూడా పలుమార్లు తిరస్కరించింది. అయినా సొసైటీ ఉన్నతాధికారులు అదే నిర్లక్ష్యం వహించారు.
317 జీవోకు సంబంధించి బదిలీల్లో సీనియర్లను వదిలి జూనియర్లకుప్రాధాన్యం ఇస్తూ ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు ఇ ష్టారాజ్యంగా వ్యవహరించారు. చివరి నిమి షం వరకూ 130 మందిలో కేవలం కొద్దిమందినే సొసైటీ బదిలీ చేసింది. స్పౌజ్ క్యాటగిరీలో 81 మందికి, మెడికల్ గ్రౌండ్లో ఆరుగురిని బదిలీ చేశారు. అందులోనూ సీనియర్ల, రోస్టర్ పాయింట్లలో ముందున్న వారిని కాద ని జూనియర్లకు అవకాశం కల్పించారని అప్పు డే ఆరోపణలొచ్చాయి. మిగతా దరఖాస్తుల పరిస్తితి ఏమిటన్నది ఇప్పటికీ తెలియడమే లేదు. ప్రజాభవన్లో ఫిర్యాదు చేసినా ఫలి తం లేకుండా పోయిందని బాధిత టీచర్లు కన్నీ టి పర్యంతమవుతున్నారు. అర్హత ఉన్న అందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ప్రభుత్వాన్ని, సొసైటీ ఉన్నతాధికారులను హెచ్చరించారు.
అవకతవకలను సవరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఈ నెల 25 నుంచి బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. టిగారియా జనరల్ సె క్రటరీ సెంట్రల్ యూనియన్ డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలో గురుకుల టీచర్లు ఆ యూనియన్ కార్యాలయం లో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 317 జీవో అమలులో జరిగిన అవకతవకలను ప్రభుత్వ పెద్దలు, టీచర్ ఎమ్మెల్సీలు, రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. 25న 150 మంది టీచర్లతో బస్సుయాత్ర నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.