సూర్యాపేట టౌన్/భువనగిరి అర్బన్, జనవరి 31 : ఈ నెల ఏడు వరకు ఎస్సీ వర్గీకరణ చేయకుంటే లక్ష డప్పులు, వేల గొంతులతో సునామీ సృష్టిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణను దేశంలోనే ముందు గా అమలు చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ఎవ రి మాటలకు తలొగ్గి అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా జరుగని సాంస్కృతిక ప్రదర్శన 7న హైదరాబాద్‌లో జరుగనుందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, సూర్యాపేట జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణకు అనుకూలంగా మూడు కమిషన్లు తీర్పు ఇచ్చాయని, మూడు సార్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారని తెలిపారు. వర్గీకరణకు అడ్డుతగులుతున్న ది కాంగ్రెస్‌లోని మాలలేనని ఆరోపించారు.