SC Classification Act | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టా న్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అందుకు సంబంధించిన జీవో ను జారీ చేయనున్నట్టు క్యాబినెట్ సబ్‌కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశానికి సంబంధించిన క్యాబినెట్ సబ్-కమిటీ తుది సమావేశాన్ని సచివాలయంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు.
చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో కొనసాగిన సమావేశంలో ఉప కమిటీ వైస్ చైర్మన్, మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు సీతక, పొన్నం ప్రభాకర్, కమిషన్‌కు నాయకత్వం వహించిన రిటైర్డ్ న్యాయమూర్తి షమీమ్ అక్తర్, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, లా సెక్రటరీ తిరుపతి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కమిషన్ సిఫారసుల అమలు మార్గదర్శకాలను కమిటీ సమీక్షించింది.
అనంతరం సబ్‌కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. చట్టం విధి విధానాలను వివరించే ప్రభుత్వ ఉత్తర్వు (జీవో)ను అంబేదర్ జయంతిని పురస్కరించకుని సోమవారం జారీ చేస్తామని, మొదటి ప్రతిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేస్తామని వెల్లడించారు. ఎస్సీ ఉప-వర్గీకరణను అమలుచేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఏ ప్రయోజనాలనూ నీరుగార్చబోమని, అన్నీ ఎస్సీ వర్గాల హకులను కాపాడుతూ న్యాయాన్ని పెంపొందించడానికి వర్గీకరణ రూపొందించామని వెల్లడించారు.
గ్రూపు ఉపకులాలు రిజర్వేషన్ శాతం
ఏ 15 1%
బీ 18 9%
సీ 26 5%