హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ జీ విద్యాసాగర్‌రెడ్డికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. విద్యాసాగర్‌రెడ్డి, మరికొందరు రిటైర్డ్ ఉద్యోగులు స్త్రీనిధిలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల పట్ల కులవివక్ష చూపుతున్నారని పెద్దపల్లి జిల్లా స్త్రీనిధి మాజీ రీజినల్ మేనేజర్ ఎం అరుణ్‌సింగ్ ఇటీవల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
నిరుడు తప్పుడు నివేదిక ఇచ్చినందున మళ్లీ విచారణ జరుపాలని కోరారు.