హైదరాబాద్, జూలై17 (నమస్తే తెలంగాణ) : నీట్ 2026 ఫలితాల్లో ఎస్సీ, బీసీ గురుకుల సొసైటీల పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ల విద్యార్థులు సత్తా చాటారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కలిపి మొత్తంగా 428 మంది విద్యార్థులు సీట్లు సొంతం చేసుకున్నారు. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని సీవోఈల నుంచి 333మంది విద్యార్థులు సీట్లు సాధించారు. బీసీ గురుకులం నుంచి మొత్తంగా 95మంది విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు అర్హత సాధించారు.
ఫలితాలపై ఎస్సీ, బీసీ సంక్షేమశాఖల మంత్రులు హర్షం వ్యక్తంచేశారు. సీట్లు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫలితాల సాధనకు కృషి చేసిన ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి విజయేంద్రబోయి, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బాలమాయదేవి, సొసైటీల కార్యదర్శులు సైదుల, శారదను, బోధన, బోధనేతర సిబ్బందిని మంత్రులు అభినందించారు.
హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): 2026 నీట్ ఫలితాల్లో సరూర్‌నగర్‌కు చెందిన మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాల విద్యార్థినులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. తొమ్మిది మంది విద్యార్థులకు మెడికల్ సీట్లు లభించాయి. కళాశాల నుంచి 72 మంది పరీక్షకు హజరుకాగా 67 మంది క్వాలీఫై ఆయ్యారని కళాశాల ప్రిన్స్‌పాల్ రశ్మిత శుక్రవారం తెలిపారు. ఇందులో ఎంబీబీఎస్‌లో 9 మంది, బీడీఎస్ లో 9, బీఏఎంఎస్‌లో11, బీహెచ్‌ఎంఎస్‌లో 6 మంది విద్యార్థినులు క్వాలిఫై అయినట్టు పేర్కొన్నారు. బీ హిమాని 490 మారులు , జీ సుప్రియ 485 మార్కులు, బీ కల్పిత 466, జీ హర్షిణి 450, కే సాయిసోనియా 449, ఎం గౌతమి 448, ఎస్ స్నిగ్ధ 432, ఎల్ శ్రియ 408, టీ ముతవ్య 406 మారులు సాధించారని పేర్కొన్నారు. సంస్థ కార్యదర్శి సైదులు విద్యార్థినులను, అధ్యాపకులను, సిబ్బందిని అభినందించారు.