TG Polycet | హైదరాబాద్ : ఈ నెల 24న టీజీ పాలిసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు పాలిసెట్ అధికారులు ప్రకటించారు. మే 13వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 276 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,06,716 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 98,858 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.