హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రాయదుర్గంలోని తమ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా, చట్టవిరుద్ధంగా వేలం వేసిందంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల రాయదుర్గంలో జరిగిన వేలంలో ఎకరం రూ.170 కోట్లు పలికిన భూమి తమదేనని పేరొన్నది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ పన్మక్త గ్రామ సర్వే నంబర్ 83/1లో ఐదెకరాల భూమిపై సర్వ హకులు తమవేనంటూ అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది. ఆ భూములను వేలం వేసేందుకు మే 6న జారీ చేసిన నోటిఫికేషన్‌ను, తదనుగుణంగా నిర్వహించిన వేలం ప్రక్రియను, భూమి విక్రయాన్ని రద్దు చేయాలని ఎస్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది బీఎస్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గురువారం తదుపరి విచారణ జరుపుతామని జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ప్రకటించారు.