SBI | ఈఎంఐ కట్టినా వాహనం స్వాధీనం.. ఎస్బీఐకి రూ.50 వేలు జరిమానా
SBI | ఈఎంఐలు చెల్లిస్తున్నా వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ఘటనలో ఎస్బీఐకి రూ.50 వేల జరిమానాతో పాటు రూ.20 వేల కోర్టు ఖర్చులు చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ఆదేశించింది.
SBI | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఈఎంఐలు చెల్లిస్తున్నా వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ఘటనలో ఎస్బీఐకి రూ.50 వేల జరిమానాతో పాటు రూ.20 వేల కోర్టు ఖర్చులు చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న వాహన విలువ ప్రకారం రూ.2 లక్షలు వినియోగదారుడికి చెల్లించాలని, వాహన కొనుగోలుదారు లోన్ ఖాతాను మూసివేయాలని బ్యాంకును నిర్దేశించింది. సిబిల్లో ప్రతికూల అంశాలను కూడా సరిచేయాలని కమిషన్ అధ్యక్షురాలు బీ ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సీ లక్ష్మీప్రసన్న, ఆర్ నారాయణరెడ్డితో కూడిన బెంచ్ సూచించింది.
శంషాబాద్లోని రుద్రకాలనీకి చెందిన శ్రీగిరి స్మిత 2016లో ఎస్బీఐ నుంచి వాహన లోన్ తీసుకొన్నారు. అప్పటి నుంచి నెలనెలా ఈఎంఐ చెల్లిస్తున్నారు. తన సేవింగ్ బ్యాంక్ ఖాతా (సౌత్ ఇండియన్ బ్యాంక్) శంషాబాద్ బ్రాంచ్ నుంచి ఈఎంఐ చెల్లిస్తున్నారు. 2018 డిసెంబర్లో ఈఎంఐకి సరిపడా నిల్వ ఉన్నా సాంకేతిక సమస్య వల్ల డిడక్ట్ కాలేదు. దీంతో చెల్లింపులు చేయలేదని ఎస్బీఐ ఏజెంట్లు వాహనాన్ని తీసుకెళ్లారు. గర్భవతి అని చూడకుండా తనపట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారని బాధితురాలు వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. రికవరీ ఏజెంట్లు నిబంధనలు ఉల్లంఘించారని కమిషన్ మండిపడుతూ, బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CIBIL
- Hyderabad
- sbi
- vehicle loan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

