ఉత్తరకాశి (ఉత్తరాఖండ్), జూలై 25: కేవలం 16 రోజుల్లోనే ఎవరెస్టు, మకాలు పర్వతాలను అధిరోహించిన తొలి భారత మహిళగా ఉత్తరాఖండ్‌కు చెందిన సవిత కంజ్వాల్ రికార్డు సృష్టించారు. ఉత్తరకాశిలోని లాంగ్త్రూ గ్రామానికి చెందిన 26 ఏండ్ల సవిత.. 8,848 మీటర్ల ఎవరెస్టు శిఖరాన్ని మే 12న, 8,485 మీటర్ల ఎత్తయిన మకాలు పర్వతాన్ని మే 28వ తేదీన విజయవంతంగా అధిరోహించారు. తాను 11వ తరగతి చదువుతుండగా.. అడ్వెంచర్ ఫౌండేషన్ కోర్సులో చేరినప్పుడు పర్వతారోహణపై ఆసక్తి ఏర్పడిందని సవిత తెలిపారు. ఏడు ఖండాల్లోని ఎత్తయిన శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆమె పేర్కొన్నారు.