బయ్యారం, ఏప్రిల్ 17 : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆరే తెలంగాణకు రక్ష అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో గురువారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా పుట్టిన బీఆర్ఎస్ 25 ఏండ్లు పూర్తి చేసుకొని ఈనెల 27న ఎల్కతుర్తిలో భారీ సభ జరుపుకుంటున్నదని తెలిపారు. సభకు ఇల్లందు నియోజకవర్గంలోని ప్రతి మం డలం నుంచి వెయ్యి మంది కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియనాయక్, జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందు సారథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేసి సభను విజయవంతం చేయాలని కోరారు.