కంది, ఏప్రిల్ 10 : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ గౌరవ సలహాదారుగా డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జీ సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. దేశంలోని రక్షణ, ఏరోస్పేస్ సాంకేతిక రంగాల్లోని ప్రముఖ శాస్త్రవేత్తల్లో డాక్టర్ సతీశ్‌రెడ్డి ఒకరు. కేంద్ర రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా, జాతీయ భద్రతా సలహా మండలి(ఎన్ఎస్ఏబీ) సభ్యుడిగా ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి క్యాబినెట్ హోదాలో గౌరవ సలహాదారు (ఏరోస్పే స్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్), ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడి గా, బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ లో సీనియర్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. దేశం కోసం పరిశోధనలు, అభివృద్ధి రంగంలో నూతన శిఖరాలను అధిరోహించేందుకు తనవంతు కృషి చేస్తానని సతీశ్‌రెడ్డి తెలిపారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళంలో ఐఐటీహెచ్ కొనసాగిస్తున్న సేవలను మరింత బలోపేతం చేస్తామని డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): గురుకుల పాఠశాలలు, అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి వస్ర్తాలను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం డి మాండ్ చేసింది. ఈ మేరకు ఫోరం నేత, చేనేత దినోత్సవ వ్యవస్థాపకుడు వెంకన్నతోపాటు పలువురు చేనేత సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. టెస్కో ద్వా రానే వస్ర్తాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వమే నిరుడు జీవో 1ని విడుదల చేసిందని గుర్తుచేసినా, అందుకు విరుద్ధంగా ఓపెన్ టెండర్ ఆహ్వానించడం తగదని మండిపడ్డా రు. తద్వారా కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వివరించారు. వెంటనే టెండర్ ప్రక్రియను రద్దు చేసి, టెస్కో ద్వారా వ స్ర్తాలను కొనుగోలు చేయాలని కోరారు.