కంది, సెప్టెంబర్ 8: సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో అత్యాధునిక మైక్రోస్కోపీ పద్ధతులను ఉపయోగించి వినూత్న ఆవిష్కరణలకు చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో సతి (సాఫిస్టికేటెడ్ అనలిటికల్ అండ్ టెక్నికల్ హెల్ప్ ఇన్స్టిట్యూట్) సెంటర్‌ను భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్టీ) కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఐఐటీ హెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఐఐటీ హెచ్ చైర్మన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, హైదరాబాద్ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జగదీశ్వరరావు, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ చైర్పర్సన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
హైదరాబాద్ టీటీడీ ఆలయాల్లో తిరుమల లడ్డూ
తిరుపతి తిరుపతి దేవస్థానం
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. తిరుమల లడ్డూ నిత్యం హైదరాబాద్‌లో లభ్యం కానుందని ప్రకటించింది. హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇక నుంచి ప్రతిరోజూ లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుందని టీటీడీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, ఎన్ నిరంజన్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకో లడ్డూను రూ. 50కి విక్రయించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లడ్డూ విక్రయాలు కొనసాగుతాయని పేరొన్నారు. భక్తులు గమనించాలని కోరారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. 20 కంపార్టుమెంట్లో భక్తులు వేచిఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నా రు. శనివారం స్వామివారిని 83,960 మంది భక్తులు దర్శించుకోగా, 32,342 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 2. 96 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.
వర్షాలతో పలు రైళ్ల రద్దు
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీలో కరుస్తున్న వర్షాల వల్ల ఆయా మార్గాలలో పలు రైళ్లను రద్దు చేసినట్టు ఆదివారం రైల్వే అధికారులు తెలిపారు. హౌరా-శ్రీసత్య సాయి ప్రశాంతి నిలయం వరకు ఈ నెల 25 నుంచి 27 వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.