Basvapur Sarpanch | సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 22: పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తెల్లవారు నుంచే బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచులు హామీలు నెరవేరుస్తున్నారు. గ్రామంలో ఎవరికైనా ఆడపిల్ల పుట్టినా.. ఎవరైనా ఆడపిల్ల పెండ్లి చేసినా రూ.5వేలు అందజేస్తానని హామీ ఇచ్చి సర్పంచ్‌గా గెలిచారు రాజన్న సిరిసిల్ల జిల్లా బస్వాపూర్‌కు చెందిన పుర్మాణి రాజశేఖర్‌రెడ్డి.
సోమవారం తన ప్రమాణం చేసిన వెంటనే గ్రామంలో తొమ్మిది మంది ఆడపిల్లల తల్లిదండ్రులకు రూ.5వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. అందుకు సంబంధించిన పత్రాలను ఎంపీడీవో లక్ష్మీనారాయణ చేతుల మీదుగా వారికి అందజేశారు. తన పదవీ కాలం ముగిసేవరకు ఇలాగే అందజేస్తానని ప్రకటించారు. సర్పంచ్ రాజశేఖర్‌రెడ్డిని గ్రామస్తులు అభినందించారు.