రంగారెడ్డి, ఫిబ్రవరి 6 (నమస్తేతెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల్లతండా సర్పంచ్ వర్త్య శాంతమ్మను 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 6 నెలలు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉపసర్పంచ్ కవితకు సర్పంచ్ బాధ్యతలను అప్పగించారు.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన శాంతమ్మ అనంతరం బీజేపీకి దగ్గరయ్యారు. శాంతమ్మ స్థానంలో ఆమె కుమారుడు పరిపాలనావ్యవహారంలో జోక్యం చేసుకోవడం జీపీ కార్యాలయం ఆవరణలో ఉన్న చెట్లను అనుమతి లేకుండా నరికివేయడం తదితర కారణాలపై గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారుల నివేదిక మేరకు కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేశారు.