ఇచ్చోడ, సెప్టెంబర్ 11: ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఇచ్చోడ మండలంలో ఉన్న ముక్రా (కే) గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి అంగన్వాడీ టీచర్‌గా మారారు. ఆమె సోమవారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పాఠాలు బోధించారు. అంగన్వాడీ టీచర్లు సమ్మె చేస్తుండటంతో ఆమె అంగన్వాడీ కేంద్రంలోకి వెళ్లి..
పిల్లలకు పాఠాలు బోధించి, పోషకాహారం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్ల సమ్మె ఎన్ని రోజులు ఉన్నా ముక్రా(కే) గ్రామంలో పిల్లలకు చదువు ఆగదని, చదువుతోపాటు పోషకాహారం అందుతుందని చెప్పారు. ఇందుకోసం మహిళా సంఘం నుంచి ఒకరిని నియమించామని సర్పంచ్ మీనాక్షి స్పష్టం చేశారు.