Government School | మరికల్: నారాయణపేట జిల్లా మరికల్ మండలం జీబండ తండాలోని సర్కారు బడి సారు లేకుండా కొనసాగుతున్నది. గతంలో ఈ పాఠశాలలో విద్యార్థులు లేకపోయినా.. కేసీఆర్ ప్రభుత్వం ఉపాధ్యాయుడు రవీంద్రనాయక్ను నియమించింది. రవీంద్రనాయక్ విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి 13 మందిని పాఠశాలలో చేర్పించారు. ఇటీవల బదిలీలో రవీంద్రనాయక్ పదోన్నతిపై వెళ్లారు.
దీంతో పాఠశాల మూతపడే పరిస్థితి ఉంది. రాధిక అనే టీచర్ బదిలీపై జీబండ కు వచ్చినా.. ఆమె పాత స్కూల్లో రిలీవ్ కాలేదు. విద్యార్థులు పాఠశాలకు వచ్చి ఖాళీగా కూర్చొని వెళ్లిపోతున్నారు. శనివారం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు వచ్చి గతంలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను చదువుకున్నారు. సీఆర్పీ శివను సంప్రదించగా.. ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లడంతో సమస్య నెలకొన్నదని చెప్పారు.