సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా సర్దార్ రవీందర్ సింగ్
Sardar Ravinder Singh | తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా సర్దార్ రవీందర్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో రవీందర్ సింగ్ రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు
హైదరాబాద్ : తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా సర్దార్ రవీందర్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో రవీందర్ సింగ్ రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సర్దార్ రవీందర్ సింగ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
న్యాయవాది నుంచి రాజకీయాల్లోకి..
సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్‌లోని సిఖ్ వాడలో 1964, ఆగస్టు 6న జన్మించారు. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో చదివారు. 1987లో నాందేడ్‌లో ఎల్ఎల్బీ పూర్తి.. న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2008లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నియ్యారు. అయితే డిగ్రీ చదివే రోజుల్లోనే 1984లో విద్యార్థి సంఘం ఎన్నికల్లో పాల్గొని అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1995లో కరీంనగర్ పురపాలక సంఘానికి జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కౌన్సిలర్‌గా విజయం సాధించాడు. ఆ తర్వాత బీజేపీలో చేరి 1999 నుంచి 2006 వరకు కరీంనగర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా పని చేశాడు.
2005లో బీజేపీ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. రవీందర్ సింగ్ 2006లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా బీజేపీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2010లో టీఆర్ఎస్ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 2010లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ముచ్చటగా మూడోసారి అంటే 2014లో కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికై, మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు రవీందర్ సింగ్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

