
హైదరాబాద్, డిసెంబరు 21 (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయ సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన సరస్‌ను హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ ప్రారంభించారు. సరస్‌ను జనవరి 3 వరకు నిర్వహిస్తారు. మొత్తం 300 స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నారు. మహిళలు, పురుషులు, అన్ని వయస్సుల వారికి అవసరమైన ఉత్పత్తులతోపాటు, గృహోపకరణాలను ప్రదర్శనలో ఉంచినట్టు సుల్తానియా తెలిపారు. కార్యక్రమంలో సెర్ప్ డైరెక్టర్లు, మెప్మా అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.