Medaram Jathara | మేడారం జాతరలో తొలి అంకం పూర్తయ్యింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దెకు చేరుకుంది. డప్పు డోలు వాయిద్యాలతో కోలాహలంగా బయల్దేరిన సారలమ్మ.. భక్తుల జయజయధ్వానాల మధ్య జంపన్న వాగు మీదుగా బుధవారం మేడారానికి చేరుకున్నది. పూనగొండ్ల నుంచి పడిగిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పలికారు. రెండేండ్ల తర్వాత వన దేవతల రాకతో ఒక్కసారిగా మేడారంలోని భక్తజనం పరవశంతో పులకించిపోయారు.
కాగా, గురువారం నాడు సమ్మక్క కూడా మేడారం గద్దెలపైకి చేరుకోనుంది. చిలుకలగుట్ట నుంచి తల్లి దిగి వచ్చి భక్తుల మొక్కులు అందుకోనుంది. సమ్మక్కను ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు.