శివ్వంపేట, సెప్టెంబర్ 21 : మెదక్ జిల్లా శివ్వంపేటలో కొలువైన బగలాముఖి శక్తిపీఠాన్ని ఆదివారం రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి దర్శించుకున్నారు. అమావాస్య కావడంతో అమ్మవారి ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో జరిగిన పసుపుతో హరిద్రార్చన, అభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం, హోమం వంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కార్యక్రమంలో శక్తిపీఠం స్థలదాత పబ్బ రమేశ్‌గుప్తా, తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేశ్‌గుప్తా, మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.