హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : సంస్కృత భాష కోసం అంతా ఏకం కావాలని సంస్కృత అకాడమీ డైరెక్టర్ డాక్టర్ పెన్నా మధుసూదన్ పిలుపునిచ్చారు. వచ్చే నెలలో తెలంగాణ సంస్కృత శంఖారావాన్ని నిర్వహిస్తామని తెలిపారు. సంస్కృత భాష గురుశిష్య సంఘం సమావేశాన్ని శనివారం హైదరాబాద్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ.. కొందరు కావాలనే సంస్కృతాన్ని వ్యతిరేకిస్తున్నారని, ఉర్దూ, అరబిక్, ఫ్రెంచ్, ఇంగ్లిష్, హిందీ భాషలతో రాని ఇబ్బంది ఒక్క సంస్కృతంతోనే వస్తుందా..? అంటూ ప్రశ్నించారు.