హైదరాబాద్, నవంబర్14(నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి : కొడంగల్ గిరిజన రైతుల భూములు లాక్కోవడం దుర్మార్గమైన చర్య అని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫార్మా కంపెనీల కోసం ముచ్చర్లలో 12 వేల ఎకరాల భూము లు ఉండగా, మళ్లీ కొడంగల్లో భూసేకరణ ఎందుకని మండిపడ్డారు. గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘కొడంగల్ ఫార్మా-భూముల కేటాయింపు’పై నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు కోసం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవ్నాయక్ మాట్లాడుతూ.. కొడంగల్ ఫార్మా భూముల కేటాయింపుపై నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. ఈ కమిటీ కొడంగల్లో పర్యటించి వివరాలు సేకరించున్నట్టు చెప్పారు.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఫార్మా క్లస్టర్ల విస్తరణ వ్యతిరేకించడం మూర్ఖత్వమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గాంధీభవన్లో గురువారం నిర్వహించిన నెహ్రూ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలేమిటో కేటీఆర్ సూచించాలన్నారు. సీములు పెరగడానికే కులగణన చేస్తున్నట్టు చెప్పారు.