హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): పట్టణాల్లో 19 నుంచి 27 వరకు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పెషల్ డ్రైవ్లో చర్యలు తీసుకోవాలని సూచించారు. పిచ్చి మొక్కలు, రోడ్ల పక్కన ఉన్న పొదలు, శిథిలావస్థకు చేరిన భవనాలు, రోడ్లపై వేసిన భవన నిర్మాణ వ్యర్థాలు, నాలాల్లో బురదను తొలగించాలని, ఇంటింటి నుంచి ప్రతి రోజు చెత్తను సేకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజా మరుగుదొడ్లకు మరమ్మతులు చేయాలని చెప్పారు. చికెన్, మటన్, చేపల మార్కెట్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, వాటి వ్యవర్థాలను సరైన రీతిలో తరలించాలని సూచించారు.