హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Weather) రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 10 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఇక హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో 12.4 డిగ్రీలు, బీహెచ్ఈఎల్లో 12.8 డిగ్రీలు, ఇబ్రహీంపట్నం, మంగల్పల్లిలో 11.4 డిగ్రీలు, దక్షిణ హైదరాబాద్లో 13 నుంచి 15 డిగ్రీలు, కోర్ సిటీలో 17 నుంచి 19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న ఎనిమిది రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
FIRST SINGLE DIGIT TEMPERATURE 🥶
Cold weather further intensified with Kohir Sangareddy recorded 9.5°C, first single digit temp of this season. Rangareddy, Vikarabad, Sangareddy, Kamareddy, Adilabad, Asifabad, Sircilla, Siddipet, Medak recorded around 10-12°C
— Telangana Weatherman (@balaji25_t) November 19, 2024