హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ‘నాతో పెట్టుకున్న వ్.. 15రోజుల్లో నీ డౌన్‌ఫాల్ స్టార్టవుతుంది.. మాగంటి గోపినాథ్‌కు చేసిన పూజనే నీకు కూడా సార్ట్ చేసిన.. నువ్వు కూడా కిడ్నీ రోగమొచ్చి చస్తావ్.. శుక్రవారం పూట పూజ సార్ట్ చేసిన.. ఇయ్యాళ్టి నుంచి నువ్వు రోజులు లెక్కపెట్టుకో.. వంద కోైట్లెనా ఖర్చుపెట్టి, నిన్ను రోడ్డుమీదకు తీసుకువస్తా!’ ఇవీ హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్‌రావు.. రహ్మత్‌నగర్‌కు చెందిన ఓ సెం ట్రింగ్ కాంట్రాక్టర్‌ను బెదిరించిన మాట లు. ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే రహ్మత్‌నగర్‌కు చెందిన నర్సింహారెడ్డి వృత్తిరీత్యా సెంట్రింగ్ కాంట్రాక్టర్. కొంతకాలం క్రితం సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్‌రావు వద్ద పనులు చేశాడు. డబ్బు లు చెల్లించాలని నర్సింహారెడ్డి అడుగుతున్నాడు. ఈ విషయంలో ఇద్దరికి వివాదం నడుస్తున్నది.
శుక్రవారం గచ్చిబౌలిలోని ఎఫ్‌సీఐ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో శ్రీధర్‌రావు, నర్సింహారెడ్డికి వాగ్వాదం జ రిగింది. అదే రోజు రాత్రి శ్రీధర్‌రావు నర్సింహారెడ్డికి ఫోన్ చేసి దుర్భాషలాడా డు. చేతబడి, క్షుద్రపూజ చేయిస్తాననని బెదిరించాడు. ఇటీవల మరణించిన మాగంటి గోపీనాథ్ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. శ్రీధర్‌రావుపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నర్సింహారెడ్డి తెలిపారు. ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్తున్నారు. ఈనెల 18న గచ్చిబౌలి, ఎఫ్‌సీఐ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో హైడ్రా అధికారులు రోడ్ల రీమార్కింగ్ సమయంలో నటి రమ్యశ్రీ సోదరుడిపై, కుషీచంద్ అనే మరో వ్యక్తిపై శ్రీధర్‌రావు దాడులకు పా ల్పడ్డాడు. దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న శ్రీధర్‌రావుపై పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ సోషల్‌మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు.