హైదరాబాద్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): వివాదాల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై సర్కారు బదిలీ వేటు వేసింది. సిరిసిల్ల కలెక్టర్‌గా ఆయనను తప్పించిన ప్రభుత్వం ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. ఆయన స్థానంలో సిరిసిల్ల కలెక్టర్‌గా విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం హరితను నియమించింది. ఈ మేరకు రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక కీలకమైన వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావును సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను వాణిజ్య పన్నులశాఖ, ట్రాన్స్పోర్ట్ కమీషనర్‌గా నియమించింది. ఆయన స్థానంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా ఉన్నటువంటి సురేంద్రమోహన్ను వ్యవసాయశాఖ కార్యదర్శిగా నియమించింది. ఇక జీఏడీ(పొలిటికల్) బాధ్యతల నుంచి కూడా రఘునందన్‌రావును తప్పించింది. ఆయన స్థానంలో వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీకి జీఏడీ(పొలిటికల్) ఎఫ్ఏసీ బాధ్యతలను అప్పగించింది.