బడంగ్‌పేట ; రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జిల్లెలగూడ చందన చెరువు నాడు కాలుష్య కాసారంగా ఉండేది. చెరువు పక్కల నుంచి ముక్కు మూసుకోకుండా పోలేని దుస్థితి ఉండేది. చెరువు నిండా గుర్రపు డెక్క ఆవరించి ఉండేది. చెరువులోకి డ్రైనేజీ వదులడం వలన మురికి కూపంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.6 కోట్లతో చందన చెరువును సరస్సులా మార్చివేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవ తీసుకొని చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయించారు. దీంతో చెరువు కొత్త శోభ సంతరించుకుంది.