హైదరాబాద్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని సనత్‌నగర్ టిమ్స్ దవాఖాను నిర్మాణ పనులను పూర్తిచేసిన వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2 నాటికి సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం సనత్‌నగర్ (ఎర్రగడ్డ)లోని టిమ్స్ దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్, డిసెంబర్17 (నమస్తే తెలంగాణ): దళితుల్లోనే అత్యంత వెనుకబడిన, అణచివేతకు గురవుతున్న(ఎంబీఎస్సీ) 57 కులాలకు ఎస్సీ వర్గీకరణలో 7 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ‘ఏ’ వర్గంలో చేర్చాలని ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాల హకుల పోరా ట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్‌ను బీఆర్కే భవన్లో మంగళవారం ఎస్సీకులాల నేతలతో కలిసి వినతిపత్రం అందించారు. 57 ఎంబీఎస్సీ కులాల స్థితిగతులపై, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయపరంగా ఇప్పటివరకు వాటిల్లిన అన్యాయాన్ని వివరించారు. మాల మాది గ కులాలతో కలపకుండా 57ఎంబీఎస్సీ కు లాలను ప్రత్యేక క్యాటగిరీలోనే ప్రతిపాదించాలని కమిషన్‌ను కోరారు. కర్నె రామారావు డకలి, కురువ జయరాములు మదాసి కురు వ, లక్ష్మీనర్సయ్య చిందు పాల్గొన్నారు.