మేడారం: సమ్మక్క-సారక్క గద్దెలు వణికిపోయాయి. ఇవాళ ఉదయం మేడారం(Medaram Earthquake)లో ఆ తల్లులు గద్దెలపై ఉన్న ఇనుప గ్రిల్స్ కూడా ఉగిపోయాయి. ములుగు జిల్లాలో ఇవాళ ఉదయం 7.27 నిమిషాలకు భూమి కంపించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూమి కంపించింది. సారక్క గద్దె వద్ద ఉన్న కెమెరాకు .. భూ ప్రకంపనలు చిక్కాయి. భూమి ప్రకంపించిన సమయంలో గద్దె వద్ద ముగ్గురు ఉన్నారు. ఓ వ్యక్తి గద్దె వద్ద కూర్చుని పూజ చేస్తుండగా, మరో వ్యక్తి అతని సమీపంలో నిలబడ్డారు. ఓ మహిళ కూడా ఆ గద్దె వద్దే ఉన్నది.
భూమి కంపిస్తున్న సమయంలో.. ఆ ముగ్గరూ కొంత ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో వాళ్లకు అర్థం కాలేదు. కొద్ది సేపు అటూ ఇటూ చూశారు. తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో.. గద్దెల చుట్టు ఉన్న గ్రిల్స్ ఊగినట్లు సీసీకెమెరాల ద్వారా స్పష్టమైంది. కెమెరాలు వణికిపోవడంతో.. అక్కడ భూమి కంపించినట్లు అర్థమైంది.