హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఒకే పార్టీ.. రెండు పొరుగు రాష్ర్టాలు.. కానీ నాయకత్వ శైలిలో నకకూ.. నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. కర్ణాటకలో అసమ్మతి గళం విప్పిన ఎమ్మెల్యేలకు అధిష్ఠానం అండతోనే గట్టిగా బుద్ధి చెప్తూ.. ‘వెళ్లేవాళ్లు వెళ్లొ చ్చు.. క్షణాల్లో రాజీనామాలు ఆమోదిస్తా’అంటూ అకడి సీఎం డీకే శివకుమార్ ఉకుసంకల్పంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అదే తెలంగాణలో మాత్రం పూర్తి భిన్నమైన ప రిస్థితి కనిపిస్తున్నది. సొంత క్యాబినెట్‌లోని ఓ మంత్రిపై చర్యలు తీసుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి పడరాని పాట్లుపడటం, దేశాలు దాటి మంతనాలు చేయడం, చివరికి ఢిల్లీకి మోకరిల్లడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
కర్ణాటక క్యాబినెట్ విస్తరణ తర్వాత పదవు లు దకని ఎమ్మెల్యేలు యశ్వంతరాయగౌడ పాటిల్, బెలూర్ గోపాలకృష్ణ వంటి నేతలు రాజీనామా అస్త్రాలు సంధించగానే పార్టీ నా యకత్వం ఏమాత్రం బెదరలేదు. ఎవరైనా పార్టీ కంటే ఎకువ కాదని డీకే స్పష్టమైన సందేశం ఇచ్చారు. అసంతృప్తి ఉన్నవారు వెళ్లిపోవచ్చని బహిరంగంగానే హెచ్చరించడంతో అసమ్మతి వర్గం తోకముడిచింది. అదేవేదికపై ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా డీకే స్పీడ్ చూసి మౌ నంగా ఉండిపోయారు. నాయకత్వం బ లంగా ఉంటే కేడర్ దానంతట అదే దారిలోకి వస్తుందనేందుకు ఇదే నిదర్శనం.
కర్ణాటకలో నాయకత్వం అంతటి తెగువ చూపిస్తే, తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ వైఖరి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నదని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో రేవంత్ తీరుపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్‌లో సర్వశక్తులూ ఒడ్డినా సమస్య కొలికి రా కపోవడంతో, చివరికి సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన బాట ప ట్టాల్సి వచ్చింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్‌ను బతిమిలాడి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించాలని ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక సాధారణ మంత్రిని సైతం తనంతట తానుగా తొలగించుకోలేని నిస్సహాయత కొట్టొచ్చినట్టు కనిపించింది. సొంత నిర్ణయాలతో దూకుడు ప్రదర్శించే కర్ణాటక లీడర్ల తీరుతో పో లిస్తే, హైకమాండ్ అనుమతి లేనిదే అడుగు కూడా ముందుకు వేయలేని రేవంత్‌రెడ్డి వైఖరి గాంధీభవన్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి మిగుల్చుతున్నది.