ప్రజా చైతన్య వేదికగా నిలవాలి
ప్రజలను చైతన్యపర్చే వేదికగా సోషల్ మీడియా నిలవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
- సీపీఐ సోషల్ మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రజలను చైతన్యపర్చే వేదికగా సోషల్ మీడియా నిలవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి సమావేశం తకళ్లపల్లి శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు, రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని నిర్వహిస్తూ సమాజాన్ని, యువతను పకదారి పట్టిస్తున్నారని అన్నారు. అలాంటి వారి కుట్రల పట్ల ప్రజలను చైతన్యవంతం చేసే బాధ్యతను సోషల్ మీడియా సభ్యులు స్వీకరించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిషారదిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి సోషల్ మీడియా ప్రాముఖ్యతను వివరించారు. సమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణి శంకర్, ఎన్ బాలమల్లేష్, ఈటీ నరసింహ, జిల్లా కార్యదర్శులు, సోషల్ మీడియా బాధ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

