హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకాన్ని రాసిన ప్రొ ఫెసర్ కంచె ఐలయ్యకు న్యాయస్థానం లో ఊరట లభించింది.
ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ పుస్తకాన్ని రాశారంటూ కోరుట్ల, కరీంనగర్ ప్రాం తాల్లో కేసులు నమోదయ్యాయి. వాటిని రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ రాధారాణి శుక్రవారం ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పారు.