Lenin | ‘పెద్ధి’ ఎఫెక్ట్‌తో అఖిల్ ‘లెనిన్’ వాయిదా … రిలీజ్ డేట్‌పై చర్చ
Lenin | ‘అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మొదటగా ఈ సినిమాను మే 1న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Lenin | ‘అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మొదటగా ఈ సినిమాను మే 1న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ‘లెనిన్’ విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ధి’ మూవీ రిలీజ్ డేట్ మారడం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉండటంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద క్లాష్ నివారించేందుకు ‘లెనిన్’ చిత్రాన్ని వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. కొత్త రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చ మొదలైంది. త్వరలోనే చిత్ర నిర్మాణ సంస్థలు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా కూడా వాయిదా పడుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.‘లెనిన్’ చిత్రానికి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేం మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ సరసన హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. మొదట ఈ ప్రాజెక్ట్ కోసం శ్రీలీలను అనుకున్నప్పటికీ, అనుకోని కారణాలతో ఆమె స్థానంలో భాగ్యశ్రీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలో శివాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, రిలీజ్ డేట్‌పై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సినీ అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Akhil
- Lenin
- movie shooting
- pedi
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

