హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : ఎట్టకేలకు మిగిలిన 8 జిల్లాల హోంగార్డులకు వేతనాలు పడ్డాయి. 22 రోజులైనా 8 జిల్లాల హోంగార్డులకు వేతనాలు ఇవ్వలేదంటూ ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక వరసగా కథనాలు రాసింది. బడుగుజీవుల వేతన వెతలపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. మిగిలిన హోంగార్డులకు సైతం తక్షణం వేతనాలు ఇవ్వాలని కోరారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, జగిత్యాల, వరంగల్, రామగుండం, వికారాబాద్ జిల్లాల్లో పనిచేస్తున్న హోంగార్డుల కు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
హైదరాబాద్,జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి జిల్లా కాటారం, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్, మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్పర్సన్, వైస్ చైర్మన్లతోపాటు నూతన పాలక వర్గాలను నియమించింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇప్పటివరకు రాష్ట్రంలో 167 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాలను నియమించినట్టు చెప్పారు.