హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉన్న దో చాటిచెప్పిన మహోధ్రుత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. ఉద్యమ సారథి కేసీఆర్ పిలుపుతో యావత్ తెలంగాణ సమాజం ఒకటైందని గుర్తుచేసుకున్నా రు. సబ్బండవర్ణాలు ఏకమై 42 రోజులపాటు శాంతియుతంగా నిరసన తెలి పి, తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చే శారని పేర్కొన్నారు. సకల జనుల సమ్మె కు శనివారంతో 14 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నాడు సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒకరికి పేరుపేరునా ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధ్రుత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె.
సబ్బండవర్ణాల ప్రజలు ఏకమై 42 రోజులపాటు శాంతియుతంగా నిరసన తెలిపి, తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసిన మహోన్నత ఘట్టం సకల జనుల సమ్మె. 2011 సెప్టెంబర్ 12న కరీంనగర్ జనగర్జనలో ఉద్యమ సారథి కేసీఆర్ పిలుపు మేరకు యావ త్ తెలంగాణ సమాజం ఒకటైంది. సమ్మెలో స్వచ్ఛందంగా భాగస్వాములై ‘ఔర్ ఏక్ ధకా.. తెలంగాణ పకా’ అని దికులు పికటిల్లేలా తెలంగాణ ప్రజలు నినదించారు. నిర్బంధాలను ఛేదించి, ఆంక్షలకు ఎదురొడ్డి, బెదిరింపులను లెకచేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ బిడ్డలు పోరాడారు. సకల జనుల సమ్మెకు నేటితో 14 ఏండ్లు నిండిన సందర్భంగా సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒకరికి పేరుపేరునా ధన్యవాదాలు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ కోసం యావత్ తెలంగాణ ప్రజలు సింహాలై గర్జించిన రోజు.. ఈ రోజు అని, స్వరాష్ట్ర కాంక్ష ను సకల జనుల సమ్మె పేరిట ప్రపంచానికి చాటి చెప్పిన మహోజ్వల ఘట్టం ఈ రోజు అని మాజీ మంత్రి హరీశ్‌రావు శనివారం ఎక్స్ ద్వారా గుర్తుచేసుకున్నారు. సరిగ్గా 14 ఏండ్ల క్రితం ఇదే రోజు మొదలైన ‘సకల జనుల సమ్మె’ 42 రోజుల పాటు నిరవధికంగా కొనసాగిందని పేర్కొన్నారు. కేసీఆర్ పిలుపుతో ప్రారంభమైన సమ్మె తెలంగాణ ఉద్యమ దిశను మలుపు తిప్పిందని, స్వరాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటింది’ అని గుర్తు చేశారు.