హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మద్దతుపై ఆలోచిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్పై వైఎస్సార్సీపీకి ఒక అభిప్రాయం ఉందని వెల్లడించారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు మద్దతుపై అందరితో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకొంటారని తెలిపారు. ఏపీలో ఓ రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పోటీలో ఉంటే మంచిదేనని వ్యాఖ్యానించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలో పోటీ చేసే ఆలోచన తమ పార్టీకి లేదని తేల్చిచెప్పారు.