హైదరాబాద్, ఏప్రిల్16 (నమస్తే తెలంగాణ): రుక్మాపూర్ సైనిక్ సూల్ లో 6వ తరగతి ప్రవేశాలకు క్యాటగిరీవారీగా 1:10 నిష్పత్తిలో విద్యార్థుల మె రిట్ జాబితా విడుదల చేశారు. తెలంగా ణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ అలుగు వర్షిణి బు ధవారం ప్రకటనలో వెల్లడించారు.
మెరిట్ జాబితా సంస్థ వెబ్సైట్లో అందుబాటులో ఉందని తెలిపారు. తొలుత మెడికల్ పరీక్షకు హాజరు కావాల్సి ఉం టుందని, వివరాలు రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నంబర్‌కు మెసేజ్ పంపిస్తామని తెలిపారు. మెడికల్ పరీక్షలో అర్హత సా ధించిన విద్యార్థులకు సైనిక్ సూల్లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుందని పేర్కొన్నారు. మలాజ్‌గిరి ఫైన్ ఆర్ట్స్ సూల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు విద్యార్థుల మెరిట్ జాబితాను కూడా విడుదల చేసినట్టు వెల్లడించారు. మే నెల మొదటి వారంలో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.