న్యూఢిల్లీ, మే 22 : దేశవ్యాప్తంగా సైనిక్ స్కూల్స్, న్యూ సైనిక్ స్కూల్స్‌లో 6, 9 తరగతుల్లో ప్రవేశం కల్పించే సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ పరీక్ష (ఏఐఎస్ఎస్ఈఈ)-2025 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీతో అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in/ AISSEEలో లాగిన్ అయి.. స్కోర్‌బోర్డ్‌ను పొందొచ్చునని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఒక ప్రకటనలో తెలిపింది.
రాత పరీక్ష తర్వాత ఎంపికైన విద్యార్థులు మెడికల్ టెస్ట్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. శారీరక ధారుఢ్య పరీక్షలో నెగ్గిన తర్వాత ఈ-కౌన్సిలింగ్ ద్వారా సైనిక స్కూల్లో సీటు ఖరారు అవుతుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ సహా ఇతర డిఫెన్స్ ట్రెయింగ్ ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశించే విధంగా విద్యార్థులకు సైనిక్ స్కూల్ విద్య దోహదపడుతుంది.