తెలుగు యూనివర్సిటీ, సెప్టెంబర్ 17: ప్రముఖ సాహితీవేత్త ఆచార్య సూగూరు వేంకట రామారావు(84) కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎస్వీ రామారావుకు భార్య, కుమారుడు ఉన్నారు. అమెరికాలో ఉన్న కుమారుడు గురువారం రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని, శుక్రవారం హైదరాబాద్‌లోనే రామారావు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్వీ రామారావు మృతిపై వివిధ రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాహితీరంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
1941జూన్ 5న వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలో జన్మించి న ఆచార్య ఎస్వీ రామారావు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో తెలుగు భాషా సాహిత్యంలో స్నాతకోత్తర పట్టభధ్రులై 1966లో తెలుగు శాఖ అధ్యాపకులుగా చేరారు. ఆచార్యులుగా, తెలుగు శాఖాధిపతి పాఠ్యాంశాల నిర్ణాయక మండలి అధ్యక్షుడిగా, ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్‌గా సేవలందించి, 2001లో ఉద్యోగ విరమణ చేశారు. డాక్టర్ సీ నారాయణరెడ్డి పర్యవేక్షణ లో ‘తెలుగులో సాహిత్య విమర్శ-అవతరణ వికాసాలు’ అనే అంశంపై పరిశోధన చేసి 1973లో డాక్టరేట్ పొందారు. రామారావు కలం నుంచి 23 గ్రంథాలు వెలువడ్డాయి. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్య విమర్శ పురస్కారం, శ్రీకృష్ణదేవరాయ తెలుగుభాషా నిలయం నుంచి దాశరథి పురస్కా రం, జీవీఎస్ సాహిత్య పీఠం నుంచి విమర్శ పురస్కారం, బూర్గుల రామకృష్ణారావు ప్రతి భా పురస్కారం, బీఎన్ శాస్త్రి పురస్కారం, సా రస్వత పరిషత్తు పురస్కారం, సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పురస్కారం వంటి అనేక గౌ రవాలు ఎస్వీఆర్ను వరించాయి. ఆయన పర్యవేక్షణలో 19మంది పీహెచ్డీ పరిశోధన, 15మంది ఎంఫిల్ పరిశోధన పూర్తి
తెలుగు సాహితీ విమర్శ, పరిశోధనా రం గాల్లో ప్రఖ్యాతి పొందిన ఎస్వీ రామారావు మరణం సాహితీలోకానికి తీరనిలోటు అని తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆచార్య ఎస్వీ రామారావు మృతి పట్ల తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే చెన్నయ్య, కోశాధికారి మంత్రి రామారావు, ట్రస్టు సభ్యుడు చింతపల్లి వసుంధరారెడ్డి, ప్రముఖ కాలమిస్ట్, రచయిత్రి దంటు కనకదుర్గ ప్రగాఢ సంతాపం తెలిపారు. రామారావుతో సాహిత్య అనుబంధాన్ని వారు స్మరించుకున్నారు. సారస్వత పరిషత్తుకు ఆయన అం దించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నా రు. తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణంపై దృష్టి పెట్టి, పరిశోధన చేసిన గొప్ప సాహితీవేత్త ఎస్వీఆర్ అని తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య వెల్దండ నిత్యానందరావు కొనియాడారు. తెలుగు సాహిత్య విమర్శ పరిణామ వికాసాలపై సాధికారికంగా పరిశోధన చేసిన సాహితీవేత్త అని గుర్తుచేసుకున్నారు.
ఎస్వీ రామారావు మృతి పట్ల మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆచార్యుడిగా, పరిశోధకుడిగా తెలుగు సాహిత్యానికి ఎస్వీ రామారావు ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఎస్వీ రామారావు తనకు ప్రత్యక్ష గురువు అని, సుమనస్వి అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ స్మరించుకున్నారు. ఎస్వీఆర్ సాహిత్య సేవలు తెలుగు సాహితీ లోకంలో శాశ్వతంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.