బడంగ్‌పేట, జూలై 28 : ‘20 ఏండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ ఇందిరమ్మ పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే మా ఇండ్లను కూలుస్తమని నోటీసులు ఇచ్చింది. అధికారులు ఎప్పుడు వచ్చి మా ఇండ్లను కూలుస్తరోనని భయమైతాంది.. మాకు మీరే న్యాయం చెయ్యాలె’ అంటూ సోమవారం మాజీ మంత్రి సబితారెడ్డిని కలిసి బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. బాలాపూర్ మండలం అల్మాస్గూడ పరిధిలోని మల్రెడ్డి రంగారెడ్డి కాలనీ, ప్రొఫెసర్ జయశంకర్ కాలనీవాసులకు బడంగ్‌పేట మున్సిపల్ అధికారులు నోటీలు జారీచేశారు. వారి ఇండ్లు కోమటికుంట బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయని 20 మందికి నోటీసులందించారు. దీంతో బాధితులు వారం నుంచి ఆందోళన చెందుతున్నారు. ఉన్నపళంగా ప్రభుత్వం బఫర్‌జోన్‌లో ఉన్నాయని నోటీలు ఇవ్వడంతో బాధితులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఆశ్రయించారు. ఏ సమయంలో తమ ఇండ్లు కూలుస్తార్నోని ఆందోళన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేకు ఇంటి పట్టాలు చూపించి తమకు ఎలాగైనా న్యా యం చేయాలని వేడుకున్నారు.
కోమటి కుంటను పరిశీలించిన సబిత
మల్రెడ్డి రంగారెడ్డి కాలనీ సమీపంలో ఉన్న కోమటికుంటను మాజీ మంత్రి సబితారెడ్డి సోమవారం పరిశీలించారు. అధికారులు జారీచేసిన ఇండ్లకు మధ్యన రోడ్డు ఉన్నదని చూపించారు. నోటీసులిచ్చిన ఇండ్లను ఎమ్మెల్యే పరిశీలించి చె రువుకు దూరంగా ఉన్న ఇండ్లకు నోటీసులెలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంబంధిత రెవె న్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో ఎమ్మె ల్యే ఫోన్లో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్ర భుత్వం ఇచ్చిన పట్టాలకు మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే నోటీసులిచ్చుడేందని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లను ప్రభుత్వమే ఎలా కూలుస్తుందని మండిపడ్డారు. బాధితులకు అం డగా ఉంటామని చెప్పారు.