హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రాసిక్యూషన్స్ జాయింట్ డైరెక్టర్గా ఉన్న ఎస్ సాంబశివరెడ్డికి ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని తెలిపారు.
భుజంగరావు బెయిలు16 వరకు పొడిగింపు
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు ఎస్పీ ఎన్ భుజంగరావుకు మరోసారి స్వల్ప ఊరట లభించింది. గతంలో ఆయనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువును హైకోర్టు ఈ నెల 16 వరకు పొడిగించింది. ఈ మేరకు జస్టిస్ కే సుజన మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.