హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తేతెలంగాణ): వచ్చే జూన్ 2నాటికి రైతు డిస్కమ్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామని రైతు డిస్కం చైర్మన్ అండ్ ఎండీ ముషారఫ్ ఫారూఖీ వెల్లడించారు. గురువారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముషారఫ్ మాట్లాడుతూ.. ఈ నెలాఖరునాటికి ఆస్తుల విభజన, మానవవనరుల కేటాయింపును పూర్తి చేస్తామని చెప్పారు.
అలాగే నిర్ణీత సమయంలోగా వినియోగదారుల విభజన, డేటా సమీకరణ, ఉద్యోగుల కూర్పు తదితర ప్రక్రియలను చేపడుతామని తెలిపారు. ఈ సమావేశంలో అస్కి సెంటర్ ఫర్ ఎనర్జీ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజకిరణ్ విబిలోలికర్, రైతు డిస్కం చీఫ్ ఇంజినీర్లు పీ ఆనంద్, ఏ కామేశ్, శ్రవణ్‌కుమార్, సీజీఎం సుధామాధురి తదితరులు పాల్గొన్నారు.