కీవ్, డిసెంబర్ 31: ఉక్రెయిన్‌పై రష్యా గగనతల దాడుల్ని ఉధృతం చేసింది. మంగళవారం రాజధాని కీవ్ సహా వివిధ ప్రాంతాలపై రష్యా పెద్ద ఎత్తున క్షిపణి, డ్రోన్ దాడులు జరిపినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. తెల్లవారుజామున 3 గంటలకు బాలిస్టిక్ క్షిపణి హెచ్చరికలు జారీచేశామని, కొన్ని నిమిషాల తర్వాత కీవ్‌లోని రెండు ప్రాంతాల్లో రెండు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
అలాగే షోస్తాకా నగరంపైనా బాంబు దాడులు జరిగినట్టు నగర మేయర్ మికోలా నోహా చెప్పారు. ఈ దాడుల్లో 12 నివాస భవనాలు దెబ్బతిన్నాయని, అందులో రెండు విద్యా సంస్థలున్నాయని చెప్పారు. కాగా మంగళవారం రష్యా సైన్యానికి చెందిన హెలికాప్టర్‌ను నావల్ డ్రోన్‌తో కూల్చేశామని ఉక్రెయిన్ మిలటరీ నిఘా విభాగం డైరెక్టరేట్ తెలిపింది. రష్యా క్షిపణి, డ్రోన్ దాడులతో ఉక్రెయిన్‌లోని సగానికిపైగా ఇంధన, విద్యుత్తు ఉత్పత్తి, మౌలిక వసతుల కేంద్రాలు ధ్వంసమయ్యాయి.
వాషింగ్టన్, డిసెంబర్ 31: అగ్రదేశం అమెరికాపై చైనా హ్యాకర్లు పంజా విసిరారు. అమెరికా ట్రెజరీ శాఖకు చెందిన పలు వర్క్ స్టేషన్లు, ముఖ్యమైన పత్రాల అపహరణ లక్ష్యంగా హ్యాకర్లు చొరబడినట్టు అధికారులు సోమవారం ప్రకటించారు. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ దృష్టికి తీసుకువెళ్లినట్టు సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది.