బెల్లంపల్లి, మే 4 : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జజ్జరవెల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మెరుగు ప్రసాద్ తండ్రి మల్లేశ్‌పై అధికార పార్టీ నాయకులు ఆదివారం దాడికి తెగబడ్డారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేశారన్న అక్కసుతో దాడులకు పాల్పడ్డారని బాధితులు పేర్కొన్నారు. మల్లేశ్ జజ్జరవెల్లిలో దుకాణానికి వెళ్తుండగా, అధికార పార్టీ నాయులు లింగంపల్లి సుశీల, లింగంపల్లి కుమార్, లింగంపల్లి సుజాత, లింగంపల్లి రాజేశ్ .. కర్రలు, కత్తులతో దాడిచేశారు. దీం తో మల్లేశ్ తల, ఛాతీ, పక్కటెముకల భాగా ల్లో తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది వచ్చి మల్లేశ్‌ను వాహనంలో తరలిస్తుండగా అధికార పార్టీ నాయకులు ఆటోను అడ్డంపెట్టి అడ్డుకున్నారు. కుటుంబసభ్యుల సమాచారంతో బ్లూకోల్ట్స్ సిబ్బంది వచ్చి 108 వాహనా న్ని బెల్లంపల్లి దవాఖానకు పంపించారు. మల్లేశ్‌ను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోమవారం పరామర్శించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అండదండలతోనే కాంగ్రెస్ నాయకులు, గూండాలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. కన్నెపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకుడు నర్సింగరావు ప్రోద్బలంతోనే దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తన్నారని అసహనం వ్యక్తంచేశారు. డీసీపీ భాస్కర్, రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝూ దృష్టికి తీసుకెళ్లి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సొంత పార్టీ నాయకుడిపైనే దాడి..
కొత్తపల్లికి చెందిన సీనియర్ నాయకు డు దుర్గం దశరథ్ గత నెల 25 నిర్వహించిన గ్రామ సభలో ప్రజలందరికీ ఉపయో గపడేలా బోరుబావి తవ్వించాలని, ఒకే కు టుంబానికి లాభం జరిగేలా ఉండకూడదని దృష్టికి తెచ్చాడు. గ్రామసభ నుంచి బయటకు వెళ్తుండగా అదే పార్టీకి చెందిన వార్డు సభ్యురాలు లింగంపల్లి సుజాత భర్త రాజేశ్, లింగంపల్లి శంకర్, లింగంపల్లి సుశీల, లింగంపల్లి రాజం దాడి చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపాననే అక్కసుతోనే తనపై దాడికి పాల్పడ్డారని ‘నమస్తే’తో దశరథ్ గోడు వెల్లబోసుకున్నాడు.